చమురు మంట, డాలర్ దెబ్బ.. భారీగా పతనమైన బంగారం, వెండి
- పెరుగుతున్న ముడిచమురు ధరలు, బలపడుతున్న డాలర్ ప్రధాన కారణం
- ఢిల్లీలో తులం బంగారంపై రూ. 4,300 వరకు తగ్గుదల
- అంతర్జాతీయ మార్కెట్లలోనూ పడిపోయిన పసిడి, వెండి ధరలు
- పెట్టుబడి సాధనంగా బంగారం ఆకర్షణ కోల్పోతోందన్న నిపుణులు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ విలువ బలపడటంతో బుధవారం దేశీయ, అంతర్జాతీయ విపణిలో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొనడంతో చమురు ధరల ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇది ద్రవ్యోల్బణం భయాలను రేకెత్తించడంతో, సురక్షిత పెట్టుబడిగా పరిగణించే బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది.
ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పన్నులతో కలిపి రూ. 4,300 మేర తగ్గి రూ. 1.56 లక్షలకు చేరుకుంది. అదేవిధంగా, కిలో వెండి ధర సుమారు రూ. 10,000 పతనమై రూ. 2.45 లక్షలకు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు దాదాపు 90 డాలర్లు క్షీణించి 4,168 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర కూడా 2.24 శాతం మేర తగ్గి ఔన్సుకు 63.87 డాలర్లుగా నమోదైంది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు ఆటంకం కలగవచ్చనే ఆందోళనలతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల మార్కును దాటింది. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని, తద్వారా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వడ్డీ ఆదాయం లేని పసిడి, వెండి వంటి ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి సన్నగిల్లింది. అదే సమయంలో డాలర్ విలువ బలపడటం కూడా బులియన్ మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచింది.